కేటీఆర్ నా తండ్రి భూమిని లాక్కున్నారు..దానం నాగేందర్ సంచలన ఆరోపణలు (video)
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
By - Knakam Karthik |
కేటీఆర్ నా తండ్రి భూమిని లాక్కున్నారు..దానం నాగేందర్ సంచలన ఆరోపణలు (video)
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా భూముల వ్యవహారంపై జరిగిన చర్చలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి, తన తండ్రికి చెందిన విలువైన భూమిని కేటీఆర్ అక్రమంగా ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని దానం నాగేందర్ సభలో మండిపడ్డారు.
తన కుటుంబానికి చెందిన ఆస్తిని లాక్కొని ఇతరులకు ధారాదత్తం చేసినా, గత పదేళ్లుగా కేటీఆర్ మరియు అప్పటి ప్రభుత్వంపై ఉన్న భయం వల్ల నోరు మెదపలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల ఒత్తిళ్లు, బెదిరింపుల కారణంగానే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం రావడంతో నిజాలు బయటపెడుతున్నానని స్పష్టం చేశారు. కేవలం తన కుటుంబానికే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది పేదల భూములను గత ప్రభుత్వం ఇలాగే లాక్కుందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని దానం నాగేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో అసెంబ్లీలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.
#Telanganaఅసెంబ్లీలో భూముల వ్యవహారంపై జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రికి చెందిన భూమిని గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ అక్రమంగా ఓ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని మండిపడ్డారు. భయంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానన్నారు. pic.twitter.com/HSxgyFWK0D
— Newsmeter Telugu (@NewsmeterTelugu) March 29, 2026