ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తేనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యం : మంత్రి పొన్నం

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నేతలతో మంత్రులు పొన్నం ప్రభాకర్,తుమ్మల నాగేశ్వరరావు సమావేశం అయ్యారు.

By Medi Samrat
Published on : 16 Aug 2025 5:00 PM IST

ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తేనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యం : మంత్రి పొన్నం

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య నేతలతో మంత్రులు పొన్నం ప్రభాకర్,తుమ్మల నాగేశ్వరరావు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత‌ అజారుద్దీన్, కార్పోరేషన్ చైర్మన్‌లు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే అకాల మరణంతో.. అనివార్య కారణాల వల్ల ఉప ఎన్నిక రానుంది. గతంలో ఈ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైంది.. జూబ్లీహిల్స్ లో చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండని ప్ర‌జ‌ల‌ను కోరారు.. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని శ్రేణుల‌కు సూచించారు.

కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అధికారంలో ఉన్న పార్టీగా జూబ్లీహిల్స్ గెలిస్తే అభివృద్ధి సాధ్యం అవుతుంది.. ప్రజా పాలన ప్రభుత్వాన్ని ఆశీర్వదించండని కోరారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది.. కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నాం.. ఎన్నిక వచ్చిందని జూబ్లీహిల్స్ కే రేషన్ కార్డులు పరిమితం కాలేదు.. రాష్ట్రం మొత్తం రేషన్ కార్డులు అందిస్తున్నాం.. సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.. ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నాం.. హైదరాబాద్ లో రోడ్లు ,డ్రైనేజీ ,శానిటేషన్ వ్యవస్థ అభివృద్ధి చేస్తున్నాం.. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలిపే విధంగా అభివృద్ధి చేస్తున్నామ‌ని వివ‌రించారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కృష్ణా ,గోదావరి జలాలు తప్ప అదనంగా ఒక చుక్క నీరు కూడా తేలేదు.. హైదరాబాద్ మౌలిక సదుపాయాలు కల్పించడం లో గత ప్రభుత్వం విఫలం అయింది. నడుస్తున్న బండికి మరింత మద్దతు ఇచ్చి.. హైదరాబాద్ అభివృద్ధి మరింత జరగాలి.. నగరంలో ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ గెలుస్తుంది అని వినబడాలని శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మరింత అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలి. ఈ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవాలి.. జూబ్లీహిల్స్ రూపు రేఖలు మార్చుకోవాలి.. ఎక్కడికి వెళ్లినా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుస్తుంది అనే మాట తీసుకోవాలని అన్నారు.

Next Story