హైదరాబాద్ నగర కాంగ్రెస్ నాయకులతో స‌మావేశ‌మైన మంత్రి

హైదరాబాద్ నగర కాంగ్రెస్ నాయకులతో హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్ లో సమావేశమ‌య్యారు

By Medi Samrat  Published on  26 Dec 2023 4:23 PM IST
హైదరాబాద్ నగర కాంగ్రెస్ నాయకులతో స‌మావేశ‌మైన మంత్రి

హైదరాబాద్ నగర కాంగ్రెస్ నాయకులతో హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్ లో సమావేశమ‌య్యారు. ఈ స‌మావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మాజీ ఎంపీ లు వి.హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్, పోటీ చేసిన అభ్యర్థులు, నగరంలోని వివిధ అనుబంధ సంఘాల ఛైర్మన్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందజేయడంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేయాలని.. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరపాలని, కాంగ్రెస్ క్యాడర్ పెద్దఎత్తున పాల్గొనాలని చెప్పారు.

28వ తేదీ నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకూ ప్రజాపాలన కార్యక్రమాలు జరుగుతాయని.. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజలకు సేవలందించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విషయంలో కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి పని చేయాలని సూచించారు.

Next Story