హైదరాబాద్ లోని పురానాపూల్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం

ఆగస్టు 13, మంగళవారం హైదరాబాద్‌లోని పురానాపూల్‌లో ఉన్న గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By Medi Samrat
Published on : 13 Aug 2024 8:00 PM IST

హైదరాబాద్ లోని పురానాపూల్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం

ఆగస్టు 13, మంగళవారం హైదరాబాద్‌లోని పురానాపూల్‌లో ఉన్న గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మధ్యాహ్నం పురానాపూల్‌లోని స్వస్తిక్ సప్లై కంపెనీ అండ్ డెకరేషన్స్‌లో మంటలు చెలరేగాయి. ఆవరణలో ఆలం అనే వ్యక్తి నిద్రిస్తూ ఉండగా.. అతని స్నేహితుడు అప్రమత్తం చేయడంతో బయటకు పరుగెత్తాడు. కాంపౌండ్‌లో ఉంచిన వస్తువులకు మంటలు అంటుకున్నాయి.

సమాచారం అందుకున్న కమాటిపుర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. గౌలిగూడ, చందూలాల్ బరాదరి నుంచి వచ్చిన రెండు అగ్నిమాపక శకటాలు రెండు గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పివేశాయి. షార్ట్‌సర్క్యూటే కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునే పనిలో అధికారులు ఉన్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story