కూతురిపై అత్యాచారం చేసిన ఓల్డ్ సిటీ వాసికి జీవిత ఖైదు

తన సొంత కుమార్తెపై లైంగిక వేధింపులకు తెగబడినందుకు 41 ఏళ్ల వ్యక్తికి పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో చట్టం) కింద జీవిత ఖైదుతో పాటు రూ. 5,000 జరిమానా విధించారు.

By Medi Samrat  Published on  22 Jun 2024 10:05 AM GMT
కూతురిపై అత్యాచారం చేసిన ఓల్డ్ సిటీ వాసికి జీవిత ఖైదు

తన సొంత కుమార్తెపై లైంగిక వేధింపులకు తెగబడినందుకు 41 ఏళ్ల వ్యక్తికి పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో చట్టం) కింద జీవిత ఖైదుతో పాటు రూ. 5,000 జరిమానా విధించారు. జూన్ 21, శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో XIIవ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఈ తీర్పును వెలువరించారు. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని హుస్సేనీ ఆలంలో దోషి నివసిస్తూ ఉన్నాడు. బాధిత బాలిక తల్లి ఇంటి పనిమనిషిగా పనిచేస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధిత బాలిక నుండి ఫిర్యాదు అందింది. మే 15 న, రాత్రి భోజనం చేసిన తర్వాత, తన తల్లిదండ్రులు ఒక గదిలో పడుకోగా.. ఆమె తన సోదరులతో కలిసి మరొక గదిలో పడుకుంది. అర్ధరాత్రి బాలిక గాఢనిద్రలో ఉండగా, ఆమె తండ్రి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మే 18న మళ్లీ అదే తరహాలో ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బాలికను బెదిరించాడు. దీంతో అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఆధారంగా హుస్సేని ఆలం ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి నరేష్ కుమార్ కేసు నమోదు చేశారు. విచారణలో అతడు అత్యాచారం చేశాడని తేలింది. కోర్టు అంతే వేగంగా నిందితుడికి జీవిత ఖైదుని విధించింది.

Next Story