హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభించారు.
By Medi Samrat Published on 18 Feb 2024 10:24 AM GMTహైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ నగరాన్ని చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని, రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. హైదరాబాద్ కు ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు ను చంద్రబాబు ప్రతిపాదిస్తే దాన్ని వైఎస్ ఆర్ పూర్తి చేశారని తెలిపారు. హైదరాబాద్ కు త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు తీసుకుని వస్తామన్నారు.
ఫైర్ డిపార్ట్ మెంట్ అనేది కేవలం అగ్ని ప్రమాదాలు కోసమే కాదని విపత్తకర పరిస్థితుల్లో కూడా వీరు సేవలు అందిస్తారని అన్నారు. ప్రాణాలకు తెగించి అందరి ప్రాణాలు కాపాడడంలో ఫైర్ డిపార్ట్ మెంట్ కీలకమని చెప్పుకొచ్చారు. ఎన్నో వేలాది నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఫైర్ డిపార్ట్ మెంట్ కి భవనం కచ్చితంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఫార్మాసిటీని ఎయిర్ పోర్ట్ పక్కన ప్లాన్ చేస్తే, మేము పల్లెల్లో ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. గత పాలకుల్లా ఫార్మాసిటీపై ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకుంటే.. మేడిగడ్డలా తయారవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచంతో పోటీపడే స్థాయికి హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పారు.