హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో శనివారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ఓ కారు అదుపు తప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అమ్మాయిలు, ఓ యువకుడు ప్రాణాలు వొదిలారు. కాగా జరిగిన దుర్ఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలపాలయ్యాడు. కారు ప్రమాదంలో గాయపడిన యువకుడు సాయి సిద్ధూ పలు కీలక విషయాలను వెల్లడించాడు. రాత్రి సిట్టింగ్ వేశామని, ముగ్గురు మద్యం సేవించారని తాను ఏం తాగలేదని చెప్పాడు. అబ్దుల్ అనే యువకుడు బ్లాక్ డాగ్, అమ్మాయిలు బీర్లు తాగారని చెప్పాడు.
మద్యం తాగిన తర్వాత రాత్రి 1 గంటలకు టీ తాగుదామని అమ్మాయిలు అన్నారని సిద్ధూ చెప్పాడు. అప్పటికే ఈ సమయంటో బయటకు వెళ్లడం మంచిది కాదని, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే సమస్యలు ఎదురు అవుతాయని చెప్పానని.. అయినా ఆ ఇద్దరు అమ్మాయిలు వినలేదని అన్నారు. టీ తాగుదామని తోడు రమ్మంటే.. బయటకు వచ్చానని సిద్ధూ తెలిపారు. తనకు డ్రైవింగ్ రాదని, అబ్దులే కారు నడిపాడని.. గచ్చిబౌలి నుండి అతి వేగంగా వస్తుంటే ప్రమాదం జరిగిందన్నాడు. అప్పటి నుండి తాను కోమాలోనే ఉన్నానని, తనకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేస్తే జీరో వచ్చిందని పేర్కొన్నాడు.
గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రోడ్డులో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళ జూనియర్ ఆర్టిస్టులు, కారు డ్రైవర్ ఉన్నారు. కాగా మరో జూనియర్ ఆర్టిస్ట్ సిద్ధుకు ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులు మానస (22), మానస (21), డ్రైవర్ అబ్దుల్లగా పోలీసులు గుర్తించారు. అమీర్‌పేటలోని ఓ హస్టల్‌లో జూనియర్ ఆర్టిస్టులు ఉంటున్నారు.