హైదరాబాద్ పోలీసులు చేసిన ఓ హెచ్చరిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎబోలా ను వ్యాప్తి చేసే కూల్ డ్రింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారని కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
వైరల్ అడ్వైజరీ కి “దయచేసి భారతదేశం అంతటా హైదరాబాద్ పోలీసులు అందించిన సమాచారాన్ని స్నేహితులందరికీ ఫార్వార్డ్ చేయండి. దయచేసి Maaza, Fanta, 7up, Coca-Cola, Mountain dew Pepsi మొదలైన శీతల పానీయాలు ఏవీ తాగవద్దు, ఎందుకంటే కంపెనీలో ఒక ఉద్యోగి ఎబోలా అనే ప్రమాదకరమైన వైరస్ తో నిండిన రక్తాన్ని అందులో కలిపారు. ఈ వార్త గురించి నిన్న NDTV ఛానెల్‌లో తెలిపారు. దయచేసి వీలైనంత త్వరగా ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేయడం ద్వారా సహాయపడండి. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులకు ఫార్వార్డ్ చేయండి. దీన్ని మీకు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ధన్యవాదాలు. " అని అందులో ఉంది.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ బృందం ఈ వైరల్ వాదనలో ఎటువంటి నిజం లేదని కనుగొంది.
వైరల్ పోస్ట్‌లో చెప్పినట్లుగా మేము NDTVలో సంబంధిత వార్తా కథనాల కోసం వెతకడం ద్వారా దర్యాప్తు ప్రారంభించాము. అయితే ఎబోలా వైరస్‌తో శీతల పానీయాలు కలుషితం కావడంపై నివేదిక ఏదీ కనుగొనలేదు. హైదరాబాద్ సిటీ పోలీసుల సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను విశ్లేషించాము.. వారి హ్యాండిల్స్‌లో కూడా ఇలాంటి వీడియోను చూడలేదు. ఏ కూల్ డ్రింక్స్ విషయంలో కూడా హెచ్చరికలు జారీ చేయలేదు.
ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. మేము 2019 లో ఇలాంటి రూమర్ కు సంబంధించిన క్లారిఫికేషన్ ట్వీట్‌ని కనుగొన్నాము.ఆ ట్వీట్‌లో, హైదరాబాద్ పౌరులకు హైదరాబాద్ పోలీసులు అలాంటి హెచ్చరికలు జారీ చేయడాన్ని మనం చూడవచ్చు.
ఇలాంటి తప్పుదారి పట్టించే క్లెయిమ్‌లతో ఈ ఫేక్ అడ్వైజరీ షేర్ చేయడం ఇదే మొదటిసారి కాదని స్పష్టమవుతోంది. జూన్ 30, 2023న PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ట్విట్టర్ లో ఇలాంటి ఫేక్ న్యూస్ వైరల్ అవుతూ ఉందని చెబుతూ.. తాము ఫ్యాక్ట్ చెక్ చేశామని తెలిపింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్‌లో ఇలాంటి సందేశాన్ని ఫేక్ అని ధృవీకరించడాన్ని కూడా మేము కనుగొన్నాము.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
Credits : Sunanda Naik