అలాంటి సర్వీస్ ఏదీ లేదు : హైదరాబాద్ సిటీ పోలీసులు

సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వైరల్ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీసులు పబ్లిక్ అడ్వైజరీ జారీ చేశారు

By Medi Samrat  Published on  22 Aug 2024 4:27 PM IST
అలాంటి సర్వీస్ ఏదీ లేదు : హైదరాబాద్ సిటీ పోలీసులు

సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వైరల్ చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీసులు పబ్లిక్ అడ్వైజరీ జారీ చేశారు. అర్థరాత్రి సమయంలో మహిళలకు "ఉచిత రైడ్ సర్వీస్" గురించి తప్పుడు వాదనతో కొన్ని పోస్టులు ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ చేశారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య ఒంటరిగా ఉన్న మహిళలు హెల్ప్‌లైన్ నంబర్‌లను సంప్రదించడం ద్వారా పోలీసు వాహనంలో ఇంటికి వెళ్లవచ్చనే వైరల్ పోస్ట్ "తప్పుదోవ పట్టించేది" అని పోలీసులు తెలిపారు. అలాంటి సర్వీస్ ఏదీ లేదని హైదరాబాద్ సిటీ పోలీసులు స్పష్టం చేశారు.

అటువంటి ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల ప్రజల్లో అనవసరమైన భయాందోళనలు, గందరగోళం ఏర్పడుతుందని హైద్రాబాద్ పోలీసులు తమ ప్రకటనలో తెలిపారు. ప్రజా భద్రతా సేవలకు సంబంధించి ఖచ్చితమైన, తాజా సమాచారం కోసం అధికారిక అకౌంట్స్ పై ఆధారపడాలని ప్రజలను కోరారు. రాత్రి పూట మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు, సెక్యూరిటీ లేదని ఫీల్ అవుతున్న సమయాల్లో కొన్ని నెంబర్లకు ఫోన్ చేస్తే పోలీసులే ఉచితంగా ప్రయాణాన్ని అందిస్తారంటూ కొన్ని నెంబర్లు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని హైదరాబాద్ పోలీసులు తాజాగా తేల్చేసారు.

Next Story