అలర్ట్ : హైదరాబాద్ లో ఈ మెట్రో స్టేషన్ లు మూసివేత
హైదరాబాద్ లోని రెండు మెట్రో స్టేషన్లను రెండు గంటలపాటు మూసివేయనున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Nov 2023 10:17 AM GMTహైదరాబాద్ లోని రెండు మెట్రో స్టేషన్లను రెండు గంటలపాటు మూసివేయనున్నారు. 2023, నవంబర్ 27వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి.. ఆరు గంటల 30 నిమిషాల వరకు చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. ముషీరాబాద్‌లో సాయంత్రం 5 గంటల నుంచి ప్రధాని మోదీ రోడ్‌షో మొదలవుతుంది. అనంతరం సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మలక్‌పేట్, యాకత్‌పురా, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, ఎల్‌బీ నగర్, మహేశ్వరం, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, మేడ్చల్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, నాంపల్లి, కార్వాన్, శేర్లింగంపల్లి, చార్మినార్, రాజేంద్రనగర్ మీదుగా కొనసాగి గోషామహల్‌లో ముగుస్తుంది. ఈ ఏరియాల్లో ప్రయాణించే ప్రయాణికులు తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు
ట్రాఫిక్ ఆంక్షలు
మోదీ రోడ్ షో సందర్భంగా మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనల్ వాహనదారులను అప్రమత్తం చేశారు. బేగంపేట విమానాశ్రయం నుండి కాచిగూడ ఎక్స్ రోడ్స్ మీదుగా ఎయిర్‌పోర్ట్ వై జంక్షన్, పీఎన్ టీ ఫ్లై ఓవర్ కింద కుడి మలుపు, షాపర్స్ స్టాప్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్ ఫ్లై ఓవర్, గ్రీన్ ల్యాండ్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, రాజీవ్ గాంధీ విగ్రహం/మోనప్ప ఐలాండ్ జంక్షన్, యశోద హాస్పిటల్, ఎంఎంటీఎస్, రాజ్ భవన్, వివి స్టాచ్యు, నిరంకారి, పాత పీఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఇందిరా రోటరీ (నెక్లెస్ రోటరీ), ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి, కట్ట మైసమ్మ, ఇందిరాపార్క్, అశోక్‌నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్లు, చిక్కడపల్లి, నారాయణగూడ మరియు కాచిగూడ ఎక్స్ రోడ్ మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.