భార్య కొడుతోంది.. విడాకులు ఇప్పించండి : గాయాలు చూపించిన భర్త(వీడియో)

ఏప్రిల్ 19, శుక్రవారం నాడు ఓ వ్యక్తి.. తన భార్య నుండి విడాకులు ఇప్పించకపోతే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో కొంపల్లిలో కలకలం రేగింది

By Medi Samrat  Published on  19 April 2024 5:37 PM IST
భార్య కొడుతోంది.. విడాకులు ఇప్పించండి : గాయాలు చూపించిన భర్త(వీడియో)

ఏప్రిల్ 19, శుక్రవారం నాడు ఓ వ్యక్తి.. తన భార్య నుండి విడాకులు ఇప్పించకపోతే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో కొంపల్లిలో కలకలం రేగింది. పోలీసులు, స్థానికులు ఆ వ్యక్తి కారణంగా టెన్షన్ పడ్డారు. నగేష్ అనే వ్యక్తి ఆ ప్రాంతంలోని జయభేరి పార్క్ చెరువులోకి దూకడానికి ప్రయత్నించగా, చుట్టుపక్కల ప్రజలు అడ్డుకున్నారు. స్థానికులతో సుదీర్ఘ చర్చల అనంతరం చెరువు నుంచి దూరంగా రావడానికి అంగీకరించాడు.


తన భార్య తనను కొడుతోందని, విడాకులు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుని చనిపోతానని నగేష్ ఆరోపించారు. తన భార్య కారణంగా అయిన గాయాలను ఆ వ్యక్తి మీడియాకు చూపించాడు. నా పిల్లల దగ్గరకు కూడా నన్ను రానివ్వడం లేదని ఆ వ్యక్తి వాపోయాడు. నాకు విడాకులు ఇప్పించండి, లేదంటే సచ్చిపోతా అంటూ అతడు బెదించాడు. చివరికి అతడికి సర్ది చెప్పడంతో చెరువులోకి దూకకుండా వచ్చేశాడు. పోలీసులు అతడిని విచారిస్తున్నారు.


Next Story