ట్రాఫిక్ పోలీసులపై యువకుడు వీరంగం

అక్టోబర్ 29, మంగళవారం నాడు జూబ్లీహిల్స్ సమీపంలో హెల్మెట్ లేకుండా రైడింగ్ చేస్తున్నందుకు ట్రాఫిక్ పోలీసులు ఆపడంతో..

By Medi Samrat  Published on  29 Oct 2024 6:45 PM IST
ట్రాఫిక్ పోలీసులపై యువకుడు వీరంగం

అక్టోబర్ 29, మంగళవారం నాడు జూబ్లీహిల్స్ సమీపంలో హెల్మెట్ లేకుండా రైడింగ్ చేస్తున్నందుకు ట్రాఫిక్ పోలీసులు ఆపడంతో.. వారితో గొడవపడి నడుచుకుంటూ వెళ్ళిపోయిన ఒక వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు ఎన్నో బూతులు కూడా మాట్లాడాడు.

గాజులరామారానికి చెందిన ఎం శ్రీనివాస్ అనే ప్రైవేట్ ఉద్యోగిపై కేసు నమోదు చేసారు పోలీసులు. ఉదయం 11:40 గంటలకు హైదరాబాద్ సబ్-ఇన్‌స్పెక్టర్, అతని బృందం సాధారణ వాహన తనిఖీని చేస్తుండగా శ్రీనివాస్ చెక్‌పాయింట్ వద్దకు వచ్చాడు. పోలీసుల చెకింగ్ కు సహకరించకుండా వెనక్కు వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తిని వెంటనే పోలీసులు అడ్డగించారు. వాహనానికి సంబంధించిన పత్రాలను చూపించమని అభ్యర్థించారు. అందుకు అతడు ఒప్పుకోకపోగా.. రచ్చ రచ్చ చేశాడు. చివరికి శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story