వదిలివేసిన లేదా తీసుకోడానికి ఎవరూ ముందుకు రాని మొత్తం 1,750 వాహనాలను బహిరంగ వేలం ద్వారా అమ్మనున్నట్లు హైదరాబాద్ నగర పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. యజమానులు తమ వాహనాలను క్లెయిమ్ చేయడంలో విఫలమైతే బహిరంగ వేలం జరుగుతుందని ప్రకటనలో తెలిపారు.
ఈ వాహనాలలో దేనిపైనైనా అభ్యంతరం లేదా యాజమాన్య హక్కులు ఉన్న ఎవరైనా పోలీస్ కమిషనర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC), బంజారా హిల్స్ లో దరఖాస్తును సమర్పించి, ప్రకటన తేదీ నుండి ఆరు నెలల వ్యవధిలోపు వాహనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. అంబర్‌పేటలోని SAR CPL పోలీస్ మైదానంలో వేలం బృందం వద్ద వాహనాల వివరాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నగర పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో కూడా సమాచారం అందుబాటులో ఉంది. బహిరంగ వేలం ద్వారా ఈ వాహనాలను అమ్మాలని పోలీసులు ప్రతిపాదించారు.