నిరాహార దీక్షకు దిగిన హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత
హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ కొంపెల్ల మాధవిలత నిరాహార దీక్షకు దిగారు.
By Medi Samrat Published on 5 March 2024 9:00 PM ISTహైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ కొంపెల్ల మాధవిలత నిరాహార దీక్షకు దిగారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సైదాబాద్ హనుమాన్ దేవాలయంపై చేపట్టిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని మాధవిలత డిమాండ్ చేశారు. సైదాబాద్ హనుమాన్ ఆలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె నిరాహార దీక్షకు కూర్చున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు హిందువుల మనోభావాలను పట్టించుకోవడం లేదని.. ఈ నిర్మాణాన్ని ఆపివేస్తున్నట్లు అధికారులు ప్రకటన చేసే వరకు తన నిరాహార దీక్షను ఆపనన్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని దారి మళ్లించాలని కోరారు.
ఇక హైదరాబాద్‌కు ఎప్పటి నుంచో ‘భాగ్యనగర్’ అనే పేరు ఉందని కొంపెల్ల మాధవి లత అన్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చితే తప్పు ఏమీ లేదని న్యూస్ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అన్నారు. మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి.. అంటూ లత హైదరాబాద్ ప్రజలను ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాలుగుసార్లు హైదరాబాద్ ఎంపీగా గెలిచిన అసదుద్దీన్ ఒవైసీకి ఓపెన్ ఛాలెంజ్ కూడా విసిరారు మాధవీ లతా. సనాతన ధర్మం వివక్ష లేకుండా ప్రజల బాధలను అర్థం చేసుకోమని చెబుతుంది.. ధర్మం అన్యాయంతో పోరాడుతుంది. సమస్యలను పరిష్కరించే విషయంలో నాకు హిందువులు, ముస్లింల విషయంలో ఎలాంటి తేడా కనిపించడం లేదు. ముస్లింలకు న్యాయం జరగాలని ఆమె అన్నారు.