హైద్రాబాద్‌లో భారీ వ‌ర్షం..

Heavy Rain In Hyderabad. రాజ‌ధానిని భారీ వర్షం ముచ్చెత్తింది. ఇప్ప‌టికే న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాలలో భారీ

By Medi Samrat  Published on  25 Sep 2021 3:33 PM GMT
హైద్రాబాద్‌లో భారీ వ‌ర్షం..

రాజ‌ధానిని భారీ వర్షం ముచ్చెత్తింది. ఇప్ప‌టికే న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాలలో భారీ వ‌ర్షం కురవ‌గా.. రాత్రి 9గంటల వరకు వర్షం కురిసే అవకాశముందని.. నగర వాసులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. సాయం కోసం 040-29555500 కు సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. వ‌ర్షం కార‌ణంగా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి ఎన్టీఆర్‌ భవన్‌ వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. వందలాది వాహనాలు ఎక్కడికక్కడే రోడ్లపైనే నిలిచిపోయాయి. అలాగే.. ముసారాంబాగ్‌ బ్రిడ్జి మీదుగా మూసీ వరదనీరు ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్తగా అధికారులు బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయడంతో ఇరు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇదిలావుంటే.. న‌గ‌రంలోని మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్‌పేట్‌, కాచిగూడ, గోల్నాక, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, లక్డీకాపూల్‌, కోఠి, అబిడ్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, సైదాబాద్‌, కూకట్‌పల్లి, ఆల్విన్‌ కాలనీ, హైదర్‌నగర్‌, ప్రగతినగర్‌, నిజాంపేట, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, పాతబస్తీ, చంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, బార్కస్, బహదూర్‌పూర, ఫలక్‌నామాలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులను మేయర్‌ విజయలక్ష్మి అప్రమత్తం చేశారు. సహాయక చర్యల కోసం అత్యవసర బృందాలను రంగంలోకి దించారు.


Next Story