3 కోట్లకు పైగా విలువైన ఫోన్స్ రికవరీ

సైబరాబాద్ పోలీసులు గత 45 రోజులుగా దొంగతనానికి గురైన, పోగొట్టుకున్న 1,100 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

By Medi Samrat  Published on  10 Dec 2024 1:45 PM GMT
3 కోట్లకు పైగా విలువైన ఫోన్స్ రికవరీ

సైబరాబాద్ పోలీసులు గత 45 రోజులుగా దొంగతనానికి గురైన, పోగొట్టుకున్న 1,100 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్‌ను ఉపయోగించి రికవరీ చేసిన రూ.3.30 కోట్ల విలువైన ఫోన్‌లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వాటి యజమానులకు అందజేశారు.

ఈ సందర్భంగా క్రైమ్స్‌ డీసీపీ కె. నరసింహ మాట్లాడుతూ.. మన దైనందిన జీవితంలో మొబైల్‌ ఫోన్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, సైబర్‌ నేరాల నుంచి పౌరులను రక్షించడంలో సైబరాబాద్‌ పోలీసులు ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే ఈ మొబైల్ ఫోన్స్ రికవరీ డ్రైవ్ అని ఆయన అన్నారు. గడిచిన 45 రోజుల్లో సైబరాబాద్ పోలీసులు 1100 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో మాదాపూర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో పరిధిలో 235 మందికి, బాలానగర్ సీసీఎస్‌లో 203 మందికి, మేడ్చల్ సీసీఎస్‌లో 185 మందికి, రాజేంద్రనగర్ సీసీఎస్‌లో 166 మందికి, శంషాబాద్ సీసీఎస్‌లో 151 మందికి, మేడ్చల్ జోన్‌లో 185 మందికి, మాదాపూర్ లా అండ్ ఆర్డర్ (ఎల్‌అండ్ ఓ) ద్వారా 07 మందికి వారి మొబైల్స్ ను తిరిగి ఇచ్చారు. మిగిలిన పోలీసు స్టేషన్స్ పరిధిలో కూడా బాధితులకు మొబైల్స్ ను అందించారు.

Next Story