మూసీపై కడుపులో విషం తగ్గించుకోండి..లేదా వికారాబాద్ అడవుల్లో వదలండి: సీఎం రేవంత్
మూసీ పరివాహకాన్ని సర్వమత సమ్మేళనంగా మారుస్తాం..అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు.
By - Knakam Karthik |
మూసీపై కడుపులో విషం తగ్గించుకోండి..లేదా వికారాబాద్ అడవుల్లో వదలండి: సీఎం రేవంత్
హైదరాబాద్: మూసీ పరివాహకాన్ని సర్వమత సమ్మేళనంగా మారుస్తాం..అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు వెళ్లి ఒకసారి విదేశీ పర్యటనకు వెళ్లి అక్కడ పరిశీలించి మూసీపై మాకు సూచనలు చేయండి. మూసీకి డీపీఆర్ సిద్ధం అయ్యాక అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఫ్లోర్ లీడర్లను పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. మూసీ మీద చర్చ జరగకూడదని ఆయన కుటుంబం చూస్తోంది. మూసీ ప్రక్షాళన కావాలో వద్దో చెప్పండి. నైట్ ఎకానమీ గా మూసి పరివాహక ప్రాంతం ను మారుస్తాం. మూసి అభివృద్ధి అడ్డుకుంటున్న వారిని అంబర్ పేట స్మశాన వాటిక దగ్గర ఉండమని చెప్పండి. అక్కడ ఉంటే వారికి మూసి దగ్గర ఉంటున్న వారి బాధ తెలుస్తుంది. వాళ్ళు చేసిన పనులు మేము చేస్తామని అనుకుంటున్నారు. Dprలు వచ్చే వరకు ఎంత బడ్జెట్ కేటాయిస్తామని మేము చెప్పలేము..అని సీఎం అన్నారు.
కడుపులో విషయాన్ని తగ్గించుకోండి. గాంధీ సరోవర్ కడుతాం. డిఫెన్స్ భూములు ఇవ్వడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది. మీ లాగా కేసులు తప్పించుకోవడానికి మేము బీజేపీతో దోస్తానం చేయడం లేదు. Ghmc పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీలతో సంబంధం లేకుండా విదేశాల్లో ఉన్న నదులు చూసి రండి అక్కడ ఉన్న పరిస్థితులు చూసి రండి ప్రభుత్వం కు మీ సలహాలు చెప్పండి సలహాలు సూచనలు తీసుకుంటాము. మూసి Dpr రెడీ అయిన తరువాత ghmc పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను, ఫ్లోర్ లీడర్ లను పిలిపించుకుని నేను ppt ఇస్తాను...గాంధీ సరోవర్ నిర్మించుకుని పెద్ద గాంధీ విగ్రహం నిర్మిస్తాం. మీరు కడుపులో విషం తగ్గించుకోండి..కడుపులో విషం పెట్టుకున్న వీళ్లను తీసుకుని వెళ్ళి వికారాబాద్ అడవుల్లో 10 రోజులు వదలండి..అని సీఎం వ్యాఖ్యానించారు.