జనవరి ఒకటి నుంచి నగరరంలో ఫ్లెక్సీలు, కటౌట్లు నిషేదమన్న మంత్రి కేటీఆర్.. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల నేఫథ్యంలో నగరమంతా గులాబీ ఫ్లెక్సీలతో నిపడంపై సమాధానం చెప్పాలని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గౌతమ్ రావు డిమాండ్ చేసారు. రాజకీయ నేతలు తమ ముఖాలు చూసుకోవడానికి మాత్రమే ఫ్లెక్సీలు పనికొస్తాయని.. ఫ్లెక్సీలతోనే లీడర్లు అవుతారా..? అని వ్యాఖ్యానించిన కేటీఆర్.. గత వ్యాఖ్యలను గుర్తుంచుకోవాలి అని అన్నారు. తన ముఖాన్ని చూసుకోవటానికే ఇప్పుడు కేటీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించుకున్నారా? అని గౌతమ్ రావు కేటీఆర్ ని ప్రశ్నించారు.
గతంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అశీర్వాద యాత్ర పేరుతో నగరానికి వచ్చినప్పుడు.. ఫ్లెక్సీలతో స్వాగతం పలికిన నేఫథ్యంలో ఎదుటి వారిని అవమానపరిచే విధంగా ఫ్లెక్సీలను తొలగించడమే కాకుండా.. ఫైన్ కూడా విధించారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కాదు.. ఇతర పార్టీలకు కోసమే నిబంధనలా? అని ప్రశ్నించారు. వివిధ విగ్రహాలకు సైతం టీఆర్ఎస్ తోరణాలను కట్టడం చాలా అవమానకరమైన విషయమని.. కేసీఆర్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని గౌతమ్ రావు ఆరోపించారు.