250 మంది పోలీసు సిబ్బంది ఒక్కసారిగా హైదరాబాద్ వీధుల్లో.. 23 మంది చిక్కారు..!

హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By -  Medi Samrat
Published on : 17 Feb 2026 5:25 PM IST

250 మంది పోలీసు సిబ్బంది ఒక్కసారిగా హైదరాబాద్ వీధుల్లో.. 23 మంది చిక్కారు..!

హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోల్కొండ జోన్ పరిధిలోని టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉంటున్న 23 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. 250 మంది పోలీసు సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. పారామౌంట్ కాలనీ (గేట్లు 1 నుంచి 4), ఐఏఎస్ కాలనీ, హకీంపేట్ కుంట ప్రాంతాల్లో పక్కా సమాచారంతో పోలీసులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) అధికారుల సహాయంతో ఈ సోదాలు జరిగాయి. వివిధ దేశాలకు చెందిన 23 మంది అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న 9 గ్యాస్ సిలిండర్లు, చట్టవిరుద్ధంగా నిల్వ ఉంచిన 53 మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అదుపులోకి తీసుకున్న విదేశీయులు ఏ దేశస్థులనే వివరాలను పోలీసులు వెల్లడించలేదు.

Next Story