హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లోనే రేపు మాక్ డ్రిల్స్

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు.

By Medi Samrat
Published on : 6 May 2025 6:01 PM IST

హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లోనే రేపు మాక్ డ్రిల్స్

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. నగరంలోని నాలుగు వ్యూహాత్మక ప్రాంతాలైన సికింద్రాబాద్ కంటోన్మెంట్, గోల్కొండ, కంచన్‌బాగ్ డీఆర్‌డీఓ (రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ), మౌలాలిలోని ఎన్‌ఎఫ్‌సీ‌లలో బుధవారం సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పౌరులను, భద్రతా సిబ్బందిని సన్నద్ధం చేయడంలో భాగంగా ఈ మాక్ డ్రిల్స్ చేపడుతున్నారు.

దేశవ్యాప్తంగా మొత్తం 244 జిల్లాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా డిఫెన్స్, అణు విద్యుత్ కేంద్రాలు ఉన్న ప్రాంతాలను ప్రాతిపదికగా చేసుకుని ఈ జిల్లాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. అణు విద్యుత్ కేంద్రాలున్న ఢిల్లీ, ముంబై, సూరత్, వడోదర, కక్రాపూర్, తారాపూర్, తాల్చేర్, కోట, రావత్ భటా, చెన్నై, కల్పక్కం, నరోరా వంటి ప్రాంతాలు కేటగిరీ-1 కిందకు వస్తాయి. ఇక కేటగిరీ-2 జాబితాలో హైదరాబాద్, విశాఖపట్నం సహా 201 జిల్లాలు ఉన్నాయి. మూడో కేటగిరీలో 45 జిల్లాలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లోని విమానాశ్రయాలు, ఇతర జనసమర్థ ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు.

Next Story