రాజధానిలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. వివరాలు ఇవే.!
By Medi Samrat Published on 14 July 2020 1:00 PM GMT2020 సంవత్సరానికి సంబంధించి గడిచిన ఆరు మాసాల్లో రోడ్డు ప్రమాదాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ రివ్యూ నిర్వహించారు. కాగా.. గడిచిన ఆరు మాసాల్లో హైదరాబాదులో 23 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. గత సంవత్సరంతో పోల్చితే.. పాదచారుల రోడ్డు ప్రమాదాలు 38% తగ్గగా.. సాధారణ ట్రాఫిక్ వాయిలేషన్ కేసులు పెరిగాయి.
2019 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 137 రోడ్డుప్రమాదాలు చోటుచేసుకోగా.. ఇక ఈ సంవత్సరం గడిచిన ఆరు నెలల్లో 106 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వాటిలో 90 ఓవర్ స్పీడు, 8 డ్రంక్ అండ్ డ్రైవ్ , రాంగ్ సైడ్ 2, నెగ్లిజెన్సి వల్ల 4, ప్రమాదవశాత్తు రాత్రి వేళల్లో శునకాలు అడ్డురావడంతో 4 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
ఇక 2020లో పెరిగిన సాధారణ ట్రాఫిక్ వాయిలేషన్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ లో 10514 కేసులు నమోదయ్యాయి. త్రిబుల్ రైడింగ్ 44098 కేసులు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ 8,7691 కేసులు, వితౌట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ 69536 కేసులు, రాంగ్ సైడ్ పార్కింగ్ 1,53,207 కేసులు, సెల్ఫోన్ డ్రైవింగ్ 12,019 కేసులు, మైనర్ డ్రైవింగ్ 1049 కేసులు, డేంజరస్ డ్రైవింగ్ 89,871 కేసులు, సిగ్నల్ జంపింగ్ 16,373 కేసులు, వితౌట్ హెల్మెట్ కేసులు 2,22,662 కేసులు నమోదు అయ్యాయి.