ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. హైదరాబాద్ లోని మదీనా మార్కెట్ లో విపరీతమైన జనం అంటూ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకూ ఆ వీడియో హైదరాబాద్ లోనిదేనా..?

నిజమెంత:
ఈ వీడియోలో కొన్ని వందల మంది బట్టల దుకాణాల మీద పడ్డం చూడొచ్చు. ఏ మాత్రం కూడా గ్యాప్ లేకుండా వాళ్ళు బట్టల కోసం ఎగబడుతూ ఉన్న వీడియో హైదరాబాద్ లోని మదీనా మార్కెట్ లోనిదని చెబుతున్నారు. మదీనా మార్కెట్ హైదరాబాద్ లోని హోల్ సేల్ బట్టల దుకాణాలకు బాగా ఫేమస్.

9 Bharat Samachar’ న్యూస్ ఛానల్ ఈ వీడియోకు కోఠీలోని, బట్టల దుకాణాలకు లింక్ చేస్తూ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. హైదరాబాద్ లో లాక్ డౌన్ నిబంధనలను అసలు పాటించడం లేదంటూ ఆ కథనాల్లో తెలిపారు. ఆ తర్వాత వీడియోను తీసివేశారు.

అజయ్ రాజ్ ఎస్ ముత్యాలయ్య అనే వ్యక్తి కూడా ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు.

హైదరాబాద్ కు చెందిన సోషల్ యాక్టివిస్ట్ సయ్యద్ అబ్దహు కషఫ్ కథనాన్ని ప్రచారం చేసిన “9 Bharat Samachar” పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు వార్తా సంస్థ ఓ కమ్యూనిటీని టార్గెట్ చేసి వీడియోను పోస్టు చేసిందని ఆయన ఆరోపించారు.. వీడియోలో చూపించింది.. పాకిస్థాన్ లోని హైదరాబాద్ లో ఉన్న మదీనా మార్కెట్ అని.. తెలంగాణలో ఉన్న మదీనా మార్కెట్ కు ఎటువంటి సంబంధం లేదని ఆయన ట్వీట్ చేశారు.

ఆయన వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. న్యూస్ మీటర్ వీడియో లోని కీ ఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను చేసింది. ఈ వీడియో మే19న పాకిస్థాన్ కు చెందిన బిజినెస్ మ్యాన్ ఉసామా ఖురేషీ ‘ఫైసలాబాద్ లోని మార్కెట్ లో ప్రస్తుత పరిస్థితి ఇది’ అంటూ ట్వీట్ చేశారు.

చాలా మంది యూజర్లు పాకిస్థాన్, ఫైసలాబాద్ లోని అనార్కలి బజార్ లోని దృశ్యాలు అని తెలిపారు. అదే వీడియోకు చెందిన విజువల్స్ ను మే 19,2020న New Anarkali Faisalabad 18 May k taaza manazir అంటూ యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు.

ఈ వీడియో రెండు రోజుల క్రితం వీడియో.. హైదరాబాద్ లోని మదీనా మార్కెట్ లో చోటుచేసుకున్న ఘటనలు అంటూ వైరల్ అవుతున్న వార్తలకు ఎటువంటి సంబంధం కూడా లేదు.

హైదరాబాద్ మదీనా మార్కెట్ లో బట్టల దుకాణంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి అని వైరల్ అవుతున్న వార్తలో ఎంత వరకూ నిజం లేదు. ఈ వీడియోకు హైదరాబాద్ కు ఎటువంటి సంబంధం లేదు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *