భాగ్యనగరం @190
By సుభాష్ Published on 19 April 2020 3:13 PM GMTతెలంగాణ కరోనా వైరస్ విజృంభిస్తోంది. హైదరాబాద్‌లో మాత్రం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక కంటైన్‌మెంట్ జోన్‌లు శరవేగంగా పెరిగిపోతున్నాయి. అందు కారణం నగరంలో అధికంగా పాజిటివ్ కేసులు పెరగడమే. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 190 కంటైన్‌మెంట్ జోన్‌లుగా గుర్తించామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ జోన్లలో లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోందని అధికారులు చెబుతున్నారు.
జోన్‌లలో సీలింగ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాం..
కంటైన్‌మెంట్ జోన్‌లలో పూర్తి స్థాయిలో సీలింగ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా కంటైన్‌మెంట్ జోన్‌లలో ఎవరు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని అంటున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రతీ రోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆదోళన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 190 కంటైన్‌మెంట్ జోన్‌లు ఉన్నాయని, కనీసం 14 రోజుల వరకూ ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండగలిగితే కరోనాను అరికట్టవచ్చని చెబుతున్నారు.
కాగా, ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. కరోనా వైరస్ తగ్గుతుందనుకునేలోపే మర్కజ్ ఉదాంతంతో మరింత ఆందోళన కలిగిస్తోంది.