కరోనా వైరస్‌ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం మే 3వ వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు వలస కార్మికులకు మేలు చేకూర్చేలా ఉన్నాయి. లాక్‌డౌన్ నేథ్యంలో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది వలస కార్మికులు చిక్కుకుని ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 20 తర్వాత దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిన ప్రాంతాల్లో లాక్‌డౌన్ నుంచి కొన్ని సడలింపులు ఇస్తూ కేంద్రం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.

ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్న వలస కార్మికులు స్థానికంగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, వారికి ఉపాధి హామీ లాంటి పనులను కల్పించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అంతేకాకుండా వలస కూలీలు పని దొరికే ప్రాంతాలకు గానీ, తమ సొంత గ్రామాలకు వెళ్తామంటే పంపించాలని తెలిపింది. అది కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించిన తర్వాతే కరోనా లేదని తేలితేనే పంపించాలని కేంద్రం సూచించింది. వారు సరైన ఆహారం లేక ఇబ్బందులకు గురవుతుంటే ప్రభుత్వాలు సాయం అందించాలని తెలిపింది.అలాగే వలస కూలీలను ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి తరలించే వీలులేదని స్పష్టం చేసింది.

Migrant Workers

సుభాష్

.

Next Story