అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఎవరూ కూడా ఇంటి నుంచి అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని ఆయ రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. రోజుకు కనీసం 8 సార్లు చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా కరోనా మన దగ్గరకు రాదని వైద్యులు చెబుతున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా అనుమానితుల కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు, కృష్ణా, కడప, కర్నూలు, తిరుపతి, విశాఖలో కరోనా అనుమానితులు ఉన్నట్లు సమాచారం. వైరస్‌ అనుమానితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఒంగోలు జిల్లాలో కరోనా కలకలం రేపింది. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడికి రిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Also Read: మేం స్వచ్ఛమైన భారతీయులం.. అలా అనకండి ప్లీజ్‌..

కాగా విద్యార్థులకు సెలవులు ఇవ్వాలన్న అంశంపై ఏపీ ప్రభుత్వాధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. ఐదో తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ఇవ్వాలన్న అంశం తెరపైకి వచ్చింది. ఇక 6 నుంచి 9వ తరగతి వరకు సెలవులు ప్రకటించి వార్షిక పరీక్షలు వచ్చే నెలలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇంటర్మీడియట్‌ పరీక్షలు తర్వలోనే ముగియనున్నాయి. అయితే స్కూళ్ల మూసివేతకు సీఎం జగన్‌ నిరాసక్తి తెలుపుతున్నారని సమాచారం. మరోవైపు విద్యార్థులకు సెలవులు ఇస్తేనే మంచిదని అధికారులు అంటున్నారు. కాగా 10వ తరగతి పరీక్షలను ఈ నెల 31వ వరకు నిర్వహించేందుకు అధికారులు మొగ్గు చూపారు.

Also Read: కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం 15 సూచనలు

ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థులను పరీక్షలు ముగిసే వరకు అక్కడే ఉంచాలని అధికారులు యోచిస్తున్నారు. డిగ్రీ విద్యార్థులకు కూడా సెలవులు ఇవ్వలా వద్దా అన్న దానిపై పరిశీలిస్తున్నారు. ఈ విషయాలపై పూర్తి స్థాయిలో సీఎం జగన్‌తో చర్చించాక.. ప్రకటనలు వెలువడనున్నాయి.

అంజి

Next Story