హైదరాబాద్: చైనాలో పుట్టిన కరోనా వైరస్‌.. ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలోని వుహాన్‌ నగరంలో కరోనా వైరస్‌ కారణంగా వేలాది మంది మృత్యువాత పడ్డారు. అంతకు పదింతల మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఇప్పడి కరోనా వైరస్‌ ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా.. కొత్త సమస్యలు కూడా తెచ్చిపెడుతోంది. మన దేశంలోచైనా నుంచి వచ్చిన వారితో మాట్లాడడానికి ప్రజలు జంకుతున్నారు. అయితే మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు.. చైనా దేశానికి చెందిన ప్రజల్లా కనిపిస్తారు. ఇక్కడే అసలు చిక్కొచ్చిన సమస్య ఎదురైంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజలను చూసి.. వారిని దూరం పెడుతున్నారట? అంతే కాకుండా వారిని కరోనా.. కరోనా.. అని పిలుస్తున్నారని కొంతమంది ఈశాన్య రాష్ట్ర విద్యార్థులు తమ బాధను చెప్పుకున్నారు.

Also Read: మహారాష్ట్రలో 39 మందికి కరోనా పాజిటివ్‌..

అయితే తాము భారతదేశానికి చెందిన వారిమని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదట. చైనా ప్రజల్లగా ఉన్న తమకు కొంత మంది ఇళ్లు ఇవ్వడానిక భయపడుతున్నారని వారు వాపోయారు. తమ స్నేహితులు కూడా దూరం పెట్టారని.. ఈ వివక్ష సరైనది కాదు అని అంటున్నారు. తాము స్వచ్ఛమైన భారతీయులమని, తమను కరోనా కరోనా అని పిలవవద్దు అని వారు ఆ వీడియోలో వేడుకున్నారు.

Also Read: హాస్టల్స్‌ వెంటనే ఖాళీ చేయండి.. విద్యార్థులకు వీసీ ఆదేశాలు..

ఈశాన్య రాష్ట్రాలు చైనాను అనుకొని ఉన్నాయి. అయిన ఇప్పటి వరకు ఆ రాష్ట్రాల్లో ఎలాంటి కరోనా వైరస్‌ కేసులు నమోదు కాలేదు. అయితే ఆ విద్యార్థులు చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దేశంలోని నలుమూలల ఉంటున్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలతో అందరూ స్పందిస్తున్నారు. మనమంతా ఒక్కటే దేశానికి చెందిన వారమని, ఇలాంటి వివక్షలు సరైనవి కావని పలువురు నెటిజన్లు అన్నారు. చైనా ప్రజలైనా, మన దేశ ప్రజలైనా వేధించడం సరికాదని అంటున్నారు. అయితే కొందరు తాము కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నామని తమ బాధను చెప్పుకొంటున్నారు.

Stop calling us corona, chinki, Chinese….North East students of Punjab.#Govt_Of_India#say #No #to #Racism#Students #Northeast#India

Dimapur 24/7 -Instagram ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಶುಕ್ರವಾರ, ಮಾರ್ಚ್ 13, 2020

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.