70 రోజుల తరువాత.. అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Aug 2020 7:23 AM GMT
70 రోజుల తరువాత.. అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అరెస్టైన కొద్ది రోజులకు ఆయన అనారోగ్యానికి గురైయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను రమేష్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆయన కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఎన్‌ఆర్‌ఐ కొవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

శుక్రవారం అచ్చెన్నాయుడికి హైకోర్టు షరతులో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఆయనను సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని న్యాయస్థానం సూచించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లిపోవద్దని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈఎస్ఐ స్కాంలో అరెస్టయిన అచ్చెన్నాయుడు.. 70 రోజులుగా రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసులో అరెస్టు అయిన ఓ వ్యక్తికి ఇటీవలనే బెయిల్ రాగా.. నేడు అచ్చెన్నాయుడికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Next Story