ఏపీ ప్రభుత్వం మరో సలహాదారు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డిని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమించింది. కృష్ణారెడ్డికి కాబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ సలహాదారుగా కృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయానికి సంబంధించిన అంబటి కృష్ణారెడ్డి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్నారు. రెండు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

ఏపీ ప్రభుత్వ ప్రజా విధానాల సలహాదారు రామచంద్రమూర్తి రెండు రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేసినట్లు రామచంద్రమూర్తి వెల్లడించారు. రామచంద్రమూర్తి సీనియర్ జర్నలిస్ట్. రామచంద్రమూర్తితో పాటు ప్రభుత్వంలో ఇప్పటికే 33 మంది సలహాదారులను నియమించారు. వీరిలో పది మందికి కేబినెట్‌ హోదా కూడా ఉంది. తాజాగా.. మరొకరిని ప్రభుత్వం సలహాదారుగా నియమించింది.

తోట‌ వంశీ కుమార్‌

Next Story