రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.!

By అంజి  Published on  9 Feb 2020 11:38 AM IST
రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.!

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. చల్లబడిన వాతవారణంతో ఆకాశం మొత్తం మబ్బులు పట్టేశాయి. తెలంగాణ, ఏపీలోని పలుప్రాంతాల్లో శనివారం సాయంత్రం పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసాయి. ఉపరిత ఆవర్తనంతో పాటు, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అయితే మరో రెండు రోజుల (ఆది, సోమవారాల్లో) పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశముందట. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో పూర్తిగా నల్లమబ్బులు పట్టేశాయి. ఖమ్మం జిల్లాలోని మిర్చి మార్కెట్‌లో వర్షం కారణంగా పంట పూర్తిగా తడిసిపోయింది.

వరంగల్‌, భూపాలపల్లి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాతో పాటు కరీంనగర్‌ జిల్లా వెల్దిలో 60, హుస్నాబాద్‌లో 30.8, సర్వాయిపేటలో 44.3 మిల్లీ మీటర్ల వర్షం పడిందని అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో భారీ వర్షం పడే ఛాన్స్‌ ఉందని వాతావరణశాఖ పేర్కొంది. బయటివాతావరణం చల్లగా ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. అకాల వర్షాల వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికోచ్చే సమయంలో వర్షాలు పడుతుండడంతో రైతులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.

Next Story