కుంగ్ ఫూ పాండ్యా మొదలుపెట్టేశాడు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Aug 2020 2:45 PM IST
కుంగ్ ఫూ పాండ్యా మొదలుపెట్టేశాడు..!

ఐపీఎల్-2020 కు ఇంకో 30 రోజులు మాత్రమే సమయం ఉన్న సంగతి తెలిసిందే..! దీంతో ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లు ప్రాక్టీస్ ను మొదలుపెట్టారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో సెప్టెంబర్ 19న ఐపీఎల్ మొదలుకానుంది. మొదటి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.

ముంబై ఇండియన్స్ శిబిరం ప్రాక్టీస్ ను ముమ్మరం చేసింది. రిలయన్స్ కార్పొరేట్ పార్క్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

⚠️ Caution: Kung Fu Pandya at work 🏏🔥 . #OneFamily #IPL2020 @hardikpandya93

A post shared by Mumbai Indians (@mumbaiindians) on

ముంబై ఇండియన్స్ జట్టు ఆల్ రౌండర్ షర్ట్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను ఆ జట్టు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో అప్లోడ్ చేసింది. "Caution: Kung Fu Pandya at work. #OneFamily #IPL2020 @hardikpandya93," అంటూ కుంగ్ ఫూ పాండ్యా(హార్దిక్ పాండ్యా ముద్దు పేరు) పనిలో ఉన్నాడని తెలిపింది.

ఐపీఎల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ముంబై ఇండియన్స్ అభిమానులు హార్దిక్ ప్రాక్టీస్ సెషన్ పై ఎంతో సంతోషంగా ఉన్నారు. హార్దిక్ ఫామ్ లో ఉంటే ఎంత అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడగలడో ప్రతి ఒక్కరికీ తెలిసిందే..! హార్దిక్ ఐపీఎల్ లో రాణించడం ద్వారానే భారత జట్టులో స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే.. చాలా మంది యువ ఆటగాళ్లకు ఐపీఎల్ ఒక మంచి వేదిక. ముంబై ఇండియన్స్ జట్టుకు హార్దిక్ పాండ్య ఎన్నో విజయాలు అందించాడు. గత సీజన్ లో కూడా హార్దిక్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 2019 సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున హార్దిక్ పాండ్యా 191.42 స్ట్రైక్ రేట్ తో 400కు పైగా పరుగులు సాధించాడు. 16 మ్యాచ్ లలో 14 వికెట్లు కూడా తీసుకున్నాడు హార్దిక్.

ఈ సీజన్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యాను ఎన్నో ఇంజురీలు ఇబ్బంది పెట్టాయి. వెన్నెముక సమస్యలు ఉండడంతో యూకేలో హార్దిక్ కు సర్జరీ కూడా జరిగింది. చాలా రోజుల గ్యాప్ రావడంతో హార్దిక్ ఈ ఐపీఎల్ లో రాణించాలని భావిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ టైటిల్ ను నిలబెట్టుకుంటుందా.. లేక ఇంకెవరైనా ఎగరేసుకుని వెళ్తారా అన్నది చూడాలి.

Next Story