తీవ్రవాదుల దగ్గర ఇలాంటివి దొరుకుతాయని అసలు ఊహించలేదు.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Jun 2020 6:25 AM GMT
తీవ్రవాదుల దగ్గర ఇలాంటివి దొరుకుతాయని అసలు ఊహించలేదు.!

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన హంద్వారా పోలీసులు పెద్ద ఎత్తున హెరాయిన్ ను సీజ్ చేశారు. అది కూడా తీవ్రవాదుల దగ్గర ఇవి దొరికాయి. 21 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకోవడమే కాకుండా 1.34 కోట్ల రూపాయల డబ్బును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పాకిస్థాన్ కు చెందిన డ్రగ్స్ స్మగ్లర్లతో టచ్ లో ముగ్గురు లష్కర్-ఏ-తోయిబా టెర్రరిస్టుల దగ్గర నుండి 100కోట్లకు పైగా విలువైన హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. 1.34 కోట్ల రూపాయల భారత కరెన్సీ కూడా వీరి దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ సందీప్ చక్రవర్తి తెలిపారు.

ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని.. ముఖ్యమైన వ్యక్తి ఇఫ్తికార్ ఇంద్రాబిని కూడా పట్టుకున్నామని తెలిపారు.

ఇఫ్తికార్ డ్రగ్స్ స్మగ్లింగ్ విషయమై ఇప్పటికే పలు ఎఫ్.ఐ.ఆర్. లు నమోదయ్యాయి. అతడి అల్లుడు మోమిన్ పీర్, మూడో వ్యక్తి ఇక్బాల్ ఉల్ ఇస్లాంను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఈ ఘటనపై మరికొన్ని అరెస్టులు చోటుచేసుకునే అవకాశం ఉంది. వీరి నుండి పలు విషయాలను కూపీ లాగుతున్నారు. పాకిస్థాన్ భారత దేశం మీదకు నార్కో టెర్రరిజాన్ని ఉసిగొల్పుతోంది. ఇందులో భాగంగానే పాకిస్థాన్ నుండి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను తరలిస్తూ ఉన్నారు.

ఈ డ్రగ్స్ ను దేశంలోని పలువురు డ్రగ్స్ డీలర్లకు అమ్మి.. వాటి ద్వారా వచ్చిన డబ్బును లష్కర్-ఏ-తోయిబా తీవ్రవాదులకు ఆర్థికంగా తోడ్పాటును అందించనున్నారు. ఇది చాలా పెద్ద హవాలా కుంభకోణం అని పోలీసులు చెబుతున్నారు. ముగ్గురు తీవ్ర వాదుల దగ్గర నుండి 21 కేజీల హై క్వాలిటీ హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో 100 కోట్లకు పైగానే వీటి విలువ ఉండనుంది. 1.34 కోట్ల రూపాయల భారత కరెన్సీని.. క్యాష్ కౌంటింగ్ మిషిన్లను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు.

Next Story