భారత పురోగతిలో ఐసీసీ పాత్ర గొప్పది : ప్రధాని మోదీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2020 8:00 AM GMT
భారత పురోగతిలో ఐసీసీ పాత్ర గొప్పది : ప్రధాని మోదీ

భారత పురోగతిలో ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్(ఐసీసీ) పాత్ర గొప్పదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఈరోజు ఐసీసీ 95 వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు. కరోనా మహమ్మారితో యావత్‌ భారత దేశం పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటోందని, గతంలో ఎన్నడూ లేని ప్రకృతి వైపరీత్యాలతో మనం పోరాడుతున్నమని, ఆత్మ నిర్భర్‌ భారత్‌ స్పూర్తితో ముందుకు సాగాలని మోదీ పిలుపునిచ్చారు. సవాళ్లను ఎదుర్కొన్న వారే చివరికి విజేతలు అవుతారని తెలిపారు.

సమస్యలకు భయపడితే ముందుకు వెళ్లలేమని, మన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే సమయం ఇదేనన్నారు.'ప్రపంచ దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయి.. మన దేశం ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఐకమత్యమే మన బలం అని అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు .. సంక్షోభాన్ని ఓ అవకాశంగా మార్చుకునేందుకు నడుం బిగించినట్లు చెప్పారు. ఈ అవకాశాన్నే ఓ టర్నింగ్‌ పాయింట్‌గా మార్చుకోవాలని, దాంతోనే స్వయం సమృద్ధి భారత్‌గా ఎదగాలని' మోదీ అన్నారు.

Next Story
Share it