కరోనా మృతదేహాల ఖననం.. కేంద్రం మార్గదర్శకాలు

By అంజి  Published on  18 March 2020 6:41 AM GMT
కరోనా మృతదేహాల ఖననం.. కేంద్రం మార్గదర్శకాలు

భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ సోకి మన దేశంలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 142కు చేరుకున్నాయి. అయితే ఇప్పటి వరకు 14 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి .. మృతదేహల నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం పెద్దగా లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే మృతదేహం వద్ద వైద్యులు, కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

కరోనా సోకి మరణించిన వారి మృత దేహాల ఖననం విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్గ దర్శకాలను జారీ చేసింది. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఈ మార్గదర్శకాలు పాటించాలని చెప్పింది. వైరస్‌ సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు, ఇన్ఫెక్షన్‌ నివారణ, వాతావరణంలో వైరస్‌ కలుషితం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కరోనా బాధితుడు చనిపోయిన తర్వాత.. ఈ వైరస్‌ ప్రభావం అంతగా ఉండదని, అయిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

Also Read: తాటిముంజల వల్ల ఉపయోగాలెన్నో.. మీకు తెలుసా ?

కేంద్రప్రభుత్వం జారీ చేసిన మార్గ దర్శకాలు..

1. మృతదేహాలను శ్మశానాకికి తీసుకెళ్లేటప్పుడు తప్పనిసరిగా పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ ధరించాలి.

2. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, గ్లవ్స్‌, మాస్క్‌లు ధరించాలి.

3.మృతదేహనికి సంబంధించిన వస్తువులతో పాటు ఆ పరిసరాలను శుభ్రం చేయాలి.

4.మృతదేహం వద్ద ఉండే వైద్యులు.. ఇన్ఫెక్షన్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

5.ఇతర మత పరమైన ప్రక్రియలు నిర్వహించుకోవచ్చు

6.మృతదేహనికి స్నానం చేయించడం, తాకడం, హత్తుకోవడం చేయరాదు.

7.శ్మశానికి కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్లడం మంచింది.

8.ఎట్టి పరిస్థితుల్లోనూ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించవద్దు.

9.ఒక వేళ మృతదేహన్ని శ్మశానికి వాహనంలో తీసుకెళ్తే.. ఆ వాహనాన్ని సోడియం హైపోక్లోరైడ్‌తో బాగా కడగాలి.

10.చివరకు తప్పనిసరిగా పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ను డిస్పోజ్‌ చేయాలి.

Next Story