ఏపీకి వెళ్లే ప్ర‌యాణికుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Aug 2020 6:57 AM GMT
ఏపీకి వెళ్లే ప్ర‌యాణికుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త‌

వేరే రాష్ట్రాల నుండి ఏపీకి వచ్చే ప్రయాణికులకు ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. రాష్ట్రంలోకి వ‌చ్చే ప్ర‌యాణికుల‌ అనుమతి నిబంధనల్లో‌ ప్రభుత్వం సడలింపులు చేసింది. కేంద్రం ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన‌ అన్‌లాక్ 3.0 నిబంధనల మేరకు వీటిని సడలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చే ప్రయాణికులకు ఆటోమెటిక్‌ ఈపాస్‌ జారీకి నిర్ణయించారు.

దీనికోసం 'స్పందన' వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈపాస్‌ జారీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే ప్రయాణికుడి మొబైల్‌, ఈమెయిల్‌కు పాస్‌ పంపనున్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఈపాస్‌తో పాటు గుర్తింపు కార్డు చూపించి రాష్ట్రంలోకి ప్రవేశించవచ్చని ప్రభుత్వం తెలిపింది.

రేపటి నుంచి ఆటోమేటిక్‌ ఈపాసులు జారీ చేయనున్నట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ఇక‌ చెక్‌పోస్టుల వద్ద నమోదు చేసుకున్న వారి వివరాలను స్థానిక సిబ్బందికి అంద‌జేస్తామ‌ని వెల్ల‌డించారు.

Next Story
Share it