కరోనా నుంచి కోలుకున్న విజయసాయిరెడ్డి.. తొలి ట్వీట్ ఏం చేశారంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Aug 2020 6:53 AM GMT
కరోనా నుంచి కోలుకున్న విజయసాయిరెడ్డి.. తొలి ట్వీట్ ఏం చేశారంటే..?

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఆయన మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న ఆయన.. దాదాపు 10 రోజుల తరువాత తొలిసారి ట్వీట్‌ చేశారు.

"భగవంతుడి దయతో, శ్రేయోభిలాషుల ప్రార్థనల బలంతో కోలుకున్నాను. అందరికీ కృతజ్ఞుడిని. మానవాళి అస్థిత్వానికి సవాలుగా మారిన కరోనాను ప్రతి ఒక్కరూ జయించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను." అని ట్వీట్ చేశారు.ఇక ఏపీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గురు, శుక్రవారాల్లో పదివేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,40,933 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1349 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 63,864 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 75,720 మంది చికిత్స పొందుతున్నారు.

Next Story
Share it