భారీగా దిగొచ్చిన బంగారం ధర

By సుభాష్  Published on  30 March 2020 7:44 AM IST
భారీగా దిగొచ్చిన బంగారం ధర

కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు సైతం అతలాకుతలం అవుతున్నాయి. కొన్ని రోజులు బంగారం పెరుగుతూ వస్తుంటే.. మరి కొన్ని రోజులు తగ్గుతూ వస్తోంది. సోమవారం పసిడి ధర ఒక్కసారిగా పడిపోయింది. దీంతో బంగారం కొనుగోలు చేస్తున్న వారికి ఇది శుభవార్తేనని చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగిన కూడా మన దేశంలో మాత్రం తగ్గడం గమనార్హం. వెండి ధర కూడా అదే బాటలో వెళ్తోంది.

హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1925 తగ్గుదలతో రూ. 43,375కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1940 తగ్గుతూ రూ.39,830కి క్షీణించింది.

ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి ధర రూ. 1910 తగ్గుతూ, రూ. 39,500లకు చేరుకుంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ తగ్గిపోవడమే ఇందుకు కారణమని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా పసిడి భారీగానే దిగొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1490 క్షీణించి, ప్రస్తుతం రూ. 43,710, ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1150 తగ్గుతూ రూ. 41,410కి పడిపోయింది.

ఇక వెండి కూడా అంతే. కిలో వెండికి రూ. 1910 తగ్గతూ రూ. 39,500 పడిపోయింది.

పసిడి ధరపై ప్రభావం చూపే కారణాలు బాగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్లో పసిడి ధరల్లో మార్పు చేర్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్నబంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ తదితర అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయి.

Next Story