ఉద్యోగులకు మోదీస‌ర్కార్‌ బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. జీతం రూ.5,500 పెంపు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 March 2020 6:42 AM GMT
ఉద్యోగులకు మోదీస‌ర్కార్‌ బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. జీతం రూ.5,500 పెంపు..

ఉద్యోగుల‌కు మోదీ స‌ర్కార్ భారీ ఊరట క‌లిగించింది. నెల‌వారి వేత‌నాన్ని పెంచాల‌ని నిర్ణ‌యించింది. అయితే ఇది అంద‌రికి కాదండోయ్‌.. రైల్వేస్‌లో ప‌నిచేసే కొంద‌రి మాత్ర‌మే. 7వ వేతన సంఝం సిఫార్సుల మేరకు స్టేషన్ మాస్టర్లకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తాజాగా 7వ వేతన కమిషన్ పే మెట్రిక్స్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో 40 వేల మందికి ఈ ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌నుంది.

ఇక.. స్టేషన్ మాస్టర్లు లెవెల్ 8 గ్రేడ్ నుంచి లెవెల్ 9కు ప్రమోట్ అవుతారు. ఈ ప్రమోషన్ కారణం ఉద్యోగుల నెలవారీ వేతనం భారీగా పెరగనుంది. లెవెల్ 8 ఉద్యోగులకు బేసిక్ వేతనం ప్రస్తుతం 47,600గా ఉంది. లెవెల్ పెరగడం వల్ల వీరి బేసిక్ వేతనం రూ.53,100కు చేరుతుంది. అంటే జీతం దాదాపు రూ.5,500 పెరుగుతుందని చెప్పుకోవచ్చు. లెవెల్ 9 గ్రేడ్‌కు ప్రమోషన్ మాత్రమే కాకుండా స్టేషన్ మాస్టర్లకు గెజిటెడ్ ర్యాంక్ కూడా లభించనుంది. ప్రమోషన్ తర్వాత స్టేషన్ మాస్టర్లకు అసిస్టెంట్ ఆపరేషన్ మేనేజర్ హోదా ఇవ్వనున్నారు. 2018 ఏప్రిల్ 1 నుంచే ఈ ప్రమోషన్ అమలులోకి వస్తుంది.

Next Story