జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Oct 2020 6:18 PM ISTజీహెచ్‌ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్) ఎన్నికలను బ్యాలెట్ విధానం ద్వారానే నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గ్రేటర్ ఎన్నికలు ఈవీఎంలు లేదా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలా అన్న దానిపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకున్నారు. దీనికి మెజార్టీ రాజకీయ పార్టీలు బ్యాలెట్ విధానం ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
మొత్తం 11 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉండగా.. 8 పార్టీలు తమ అభిప్రాయం తెలిపాయి. 5 పార్టీలు బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలని కోరగా.. బీజేపీ పార్టీ మాత్రమే ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరింది. 2 రాజకీయ పార్టీలు మాత్రం ఎలాంటి అభిప్రాయం తెలుపలేదు.
ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బ్యాలెట్ పేపర్ ఎన్నికకే అనుకూలంగా ఉంది. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలను అధికార టీఆర్‌ఎస్‌తో పాటు విపక్షాలు సైతం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.