ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి పయనమయ్యారు. కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఇద్దరు ఎంపీలు, 10 మంది బృందంతో కలిసి జగన్ ఢిల్లీ పయనమయ్యారు. ఈరోజు ఉదయం పులివెందులలోని భాకారాపురంలోని వైఎస్సార్‌ ఆడిటోరియంలో జరిగిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం నేరుగా కడప నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్న జగన్.. అక్కడి నుండి తన బృందంతో ఢిల్లీ బయల్దేరారు. కాగా రేపు నదీ జలాలపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. సమావేశంపై ఇప్పటికే సంబంధిత అధికారులకు సీఎం దిశానిర్దేశం కూడా చేశారు. అలాగే వైసీపీ ఎన్డీయేలో చేర‌బోతుంద‌నే వార్త‌లు వ‌స్తున్న నేఫ‌థ్యంలో జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ప్రాథాన్య‌త సంత‌రించుకుంది.

ఇదిలావుంటే.. సీఎం జగన్ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఖరారు అయింది. అయితే మోదీ బిజీ షెడ్యూల్ కారణంగా అపాయింట్‌మెంట్ రద్దయ్యే అవకాశం ఉన్నట్లు ఇవాళ ఉదయం వార్తలు వచ్చాయి. ఆ త‌ర్వాత ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story