షాకింగ్ విషయం చెప్పిన జెనీలియా.. ఇప్పుడు పర్లేదట
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Aug 2020 12:06 PM IST
పలువురు ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడుతున్న సంగతి తెలిసిందే..! ఎంతో మంది సినిమా తారలు, వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చాయి. నటి జెనీలియా డిసౌజా కూడా కరోనా బారిన పడినట్లు చెప్పుకొచ్చింది. మూడు వారాల కింద తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో ట్రీట్మెంట్ తీసుకున్నానని.. ఇప్పుడు తనకు బాగుందని చెప్పుకొచ్చింది.
— Genelia Deshmukh (@geneliad) August 29, 2020
33 సంవత్సరాల జెనీలియా తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగానే ఐసొలేషన్ లోకి వెళ్లానని చెప్పుకొచ్చింది. కరోనాతో పోరాడడం పెద్ద కష్టం కాదని ఇతరులకు ధైర్యం చెప్పింది. కానీ ఐసొలేషన్ లో ఉండడమే ఛాలెంజింగ్ తో కూడుకున్నదని తెలిపింది. 21 రోజుల తర్వాత నెగటివ్ అని వచ్చిందని చెప్పుకొచ్చింది.
ఫేస్‌టైం, ఇతరత్రా డిజిటల్ వ్యాపకాలు ఒంటరితనం అనే దుష్టశక్తిని అంతం చేయలేవు. నన్ను ప్రేమించే వాళ్లు, నా కుటుంబ సభ్యుల సమక్షంలోకి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నింటి కంటే ఇదే అతిపెద్ద బలమని తెలిపింది. కరోనాను జయించాలంటే ముందుగా గుర్తించడం, ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం, ఫిట్‌నెస్‌తో ఉండటం ఎంతో ముఖ్యమని జెనీలియా తెలిపింది.