గానకోకిల ల‌తా మంగేష్క‌ర్ నివాసం ఉంటున్న భవనం సీల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2020 6:20 AM GMT
గానకోకిల ల‌తా మంగేష్క‌ర్ నివాసం ఉంటున్న భవనం సీల్

గాన కోకిల లతా మంగేష్కర్ నివాసం ఉంటున్న ఇంటిని బీఎంసీ(బృహన్ ముంబై మున్సిపల్‌ అధికారులు) సీజ్ చేసారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. ఇక ముంబైలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. చిన్నా-పెద్దా, పేదా-ధనిక అన్న తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారీన పడుతున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ ఫ్యామితో పాటు ఎంతో మంది ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఈ వైరస్‌ యుక్త వయసులో వారికన్నా కూడా వృద్దులకు ప్రమాదకరంగా పరిణమించింది.

లతా మంగేష్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్ర‌భ‌కుంజ్‌లో నివసిస్తున్నారు. లతా వయస్సు 90 సంవత్సరాలు. కుటుంబ సభ్యులందరూ వృద్ధులు కావడంతో రిస్క్ ఎక్కువగా వుంటుంది.. అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఈ భవనాన్ని మూసేశారు. కేవలం వారి సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం లతా మంగేష్కర్, ఆమె కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారని, వారికి వైరస్ సోకలేదని అధికారులు తెలిపారు.

మరోవైపు తాము ఆరోగ్యంగా ఉన్నామని లతా మంగేష్కర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. తాము వైరస్ బారిన పడలేదని.. తమ ఇల్లు పరిసర ప్రాంతాల్ని సీల్ వేయడం వల్ల ఏమైందోననే ఆందోళనతో సన్నిహితులు ఫోన్ చేస్తున్నారని అన్నారు. తమ ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని విజ్ఙప్తి చేశారు. ఇక కరోనా పై పోరులో లతా మంగేష్కర్ రూ. 25 లక్షల విరాళంతో పాటు స్వచ్ఛందంగా సాయం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గానగంధర్వుడు ఎస్పీ బాలు.. కరోనా పై పోరాడుతున్నారు. ఈయనకు చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ లో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. బాలుగారు కరోనా నుంచి కోలుకుంటున్నారు.

Next Story