2017 నుండి గర్భవతిగానే ఉన్నా: సమంత

By సుభాష్  Published on  29 Aug 2020 12:08 PM GMT
2017 నుండి గర్భవతిగానే ఉన్నా: సమంత

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు తాము త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే..! దీంతో ఇప్పటికే పెళ్లి చేసుకున్న పలువురు సెలెబ్రిటీలను వారి వారి అభిమానులు మీకు పిల్లలెప్పుడూ అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. టాలీవుడ్ లోని స్టార్ కపుల్ అయిన సమంత-నాగ చైతన్య విషయంలో కూడా అలాంటి ప్రశ్నలే వస్తున్నాయి. సమంత సినిమాలకు దూరం అవుతోందని.. ఆమె ప్రెగ్నెంట్ అంటూ పలు మార్లు కథనాలు వచ్చాయి. చాలా సార్లు సమంత అండ్ టీమ్ వాటిని కొట్టి పారేశారు. తాజాగా మరోసారి సమంత ప్రెగ్నెంట్ అయిందంటూ రూమర్లు వచ్చాయి. ఓ నెటిజన్ అయితే డైరెక్ట్ గా సమంతను మీరు గర్భవతా అని ప్రశ్నించాడు. దానికి సమంతా కొంటెగా సమాధానం చెప్పింది.

'నేను 2017 నుండి గర్భవతినే.. ఈ బిడ్డ బయటకు రావడానికి చాలా సమయం తీసుకుంటోంది' అంటూ చెప్పుకొచ్చింది సామ్. 2017 లో నాగ చైతన్యను వివాహం చేసుకున్నప్పటి నుండి సమంతకు ఈ తరహా ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. 33 ఏళ్ల సమంత అభిమానులతో ముచ్చటించాలని అలా సోషల్ మీడియాలోకి వస్తే.. ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అభిమానులను హర్ట్ చేయలేక ఏదో ఒక సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

ఇక సమంత అమెజాన్ ప్రైమ్‌లో రాబోయే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌ సెకండ్ సీజన్‌లో నటించింది. మొదటి సీజన్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో రెండో సీజన్ మీద మంచి అంచనాలు ఉన్నాయి. మొదటి సీజన్ లో మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, సందీప్ కిషన్ నటించారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌ రెండో సీజన్‌లో సమంత కీలక పాత్ర పోషించనుంది. టెర్రరిస్టుగా నెగటివ్ టచ్ తో కూడిన పాత్రలో నటిస్తోందనే వార్త వైరల్ అవుతోంది. లాక్ డౌన్ కి ముందే ఈ సీరీస్ షూటింగ్ లో పాల్గొన్న సమంతా తాజాగా డబ్బింగ్ పనులను మొదలుపెట్టినట్లు అభిమానులతో పంచుకుంది.

తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్‌ సిరీస్‌‌ను దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో 'షోర్ ఇన్ ది సిటీ', 'గో గోవా గాన్' సినిమాలకు దర్శకత్వం వహించారు.

Next Story