న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  4 Sep 2020 10:22 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

1. ఎస్‌బీఐ మరో ముందడుగు.. ఖాతాదారులకు శుభవార్త

ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంకింగ్‌ రంగంలో అతిపెద్ద సంస్థ ఎస్‌బీఐ. తమ ఖాతాదారుల భద్రత కోసం ఎస్‌బీఐ మరో ముందడుగు వేసింది. బ్యాంకులకు సంబంధించిన విషయాల్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. వినియోగదారుల ఖాతాలకు సంబంధించి, ఏటీఎంల విషయాల్లో ఎన్నో మోసాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ఎస్‌బీఐ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై ఏటీఎంతో బ్యాలెన్స్‌, మినీ స్టేట్‌మెంట్‌ ఎంక్వైరీ చేసిన ప్రతిసారి రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు ఓ మెసేజ్‌ పండటం..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుండి తీసేశారుగా..!

పబ్​జీ మొబైల్ సహా 118 చైనా యాప్స్​ను నిషేధిస్తూ ఇటీవలే కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందనే కారణంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. బ్యాన్ చేసిన యాప్స్ లో పబ్ జీ కూడా ఉన్న సంగతి తెలిసిందే..! యువతలో హింసాత్మక ప్రవృత్తిని పెంచిపోషిస్తున్న పబ్ జీని దేశంలో బ్యాన్ చేయాలని డిమాండ్లు వినిపించాయి. చైనా లింక్డ్ యాప్స్ ను బ్యాన్ చేసి రెండు రోజులు అవ్వగా.. పబ్ జీ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లోనూ, యాపిల్ యాప్ స్టోర్ లోనూ కనిపించడం లేదు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

తమిళనాడులోని దారుణం చోటుచేసుకుంది. . కడలూరు జిల్లా కాట్టుమన్నార్‌ కోయిల్‌లోని ఓ బాణాసంచా కర్మాగారంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. గాయపడినవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పేలుడు దాటికి భవనం కుప్పకూలింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దుబ్బాక బరిలో కాంగ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్‌ విజయశాంతి..?

తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. బలమైన నేతను రంగంలోకి దింపి దుబ్బాక నియోజకవర్గంలో పాగా వేయాలని భావిస్తోంది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తప్పిన ఫైర్‌ బ్రాండ్‌, తెలంగాణ రాములమ్మ విజయశాంతిని బరిలో దింపేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఆ మహిళా నేతకు ఉమ్మడి మెదక్‌ జిల్లాపై ఉన్న పట్టే పార్టీకి కలిసి వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మందుబాబులకు శుభవార్త: ఏపీలో తగ్గిన మద్యం ధరలు

మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్తున్న సీఎం జగన్‌.. తాజాగా మద్యంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.150 ఉండే మద్యం బాటిళ్లపై ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది . ప్రభుత్వం. అలాగే రూ.190పైగా ఉన్న మధ్య బాటిళ్లపై ధరలను పెంచింది. సవరించిన ధరతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం

ఈ మధ్య అగ్నిప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కారణాలు ఏవైనా.. అగ్ని ప్రమాదాల కారణంగా భారీ నష్టంతో పాటు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తమిళనాడులో శుక్రవారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం అయ్యారు. సేలం జిల్లాలోని కురుంగచావడి గ్రామంలో అన్బళగన్‌ అనే వ్యక్తి ఇంట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి నిద్రలో నుంచి తెరుకున్న వారు.. తప్పించుకునేందుకు ప్రయత్నించగా, వీలు కాలేకపోయింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వాట్సాప్ గ్రూప్ నుంచి సురేశ్ రైనాను తొలగించిన సీఎస్‌కే..!

చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుతో ఎలాంటి విభేదాలు లేవని, వ్యక్తిగత కారణాలతోనే భారత్‌కు వచ్చానని.. అంతేకాకుండా టోర్నీలో మళ్లీ ఆడే అవకాశం కూడా ఉందని రైనా తెలిపిన విషయం తెలిసిందే. కాగా.. రైనా, సీఎస్‌కే వివాదం గురించి రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. తాజాగా జట్టు వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి రైనాను తొలగించారనే వార్త హల్‌చల్‌ చేస్తోంది. జట్టును వీడిన వెంటనే రైనాను వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి తొలగించారని ఓ అధికారి చెప్పాడని ఓ జాతీయ మీడియా వెల్లడించింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడ..?

మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావు ఆచూకీపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని, త్వరలో పోలీసుల ముందు లొంగిపోతాడన్న వార్తులు ఏపీ, తెలంగాణతోపాటు జాతీయ మీడియాలో జోరుగా కథనాలు వెలువడుతున్నాయి. తెలంగాణ పోలీసుల సహకారం మేరకు గణపతి లొంగుబాటుకు కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. గణపతి లొంగుబాటుపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన అనుచరులు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆడపిల్లలు పుట్టారని.. లోకం చూడని పసికవలలకు పురుగుల మందు తాగించిన తండ్రి

ఆడపిల్లలను సంరక్షించాలని ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు అవలంభిస్తు ఆడపిల్లలకు అనేక రాయితులు కల్పిస్తూ వారికి కోసం అనేక చర్యలు చేపడుతుంది. అయినప్పటికి కొందరిలో మార్పు రావడం లేదు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. అప్పుడే పుట్టిన కవలలకు తల్లిపాలకు బదులు పురుగుల మందు తాగించాడు. ప్రస్తుతం ఇద్దరు శిశువుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా గండేడు మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో జరిగింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మెయిల్‌ కలకలం.. ప్రధాని మోదీకి ప్రాణహాని..?

భారత ప్రధాని నరేంద్ర మోదీని చంపుతామని బెదిరిస్తూ ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ)కు ఈ మెయిల్‌ రావడం కలకలం రేపింది. మోడీకి వచ్చిన బెదిరింపు మెయిల్‌కు సంబంధించిన వివరాలపై ఎన్‌ఐఏ హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఓ ఈమెయిల్‌ ఐడీ నుంచి ప్రముఖ వ్యక్తులకు వచ్చిన బెదిరింపు కాపీలను హోంశాఖకు పంపుతూ వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్‌ఐఏ లేఖలో కోరింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story