వాట్సాప్ గ్రూప్ నుంచి సురేశ్ రైనాను తొలగించిన సీఎస్‌కే..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Sep 2020 6:13 AM GMT
వాట్సాప్ గ్రూప్ నుంచి సురేశ్ రైనాను తొలగించిన సీఎస్‌కే..!

చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుతో ఎలాంటి విభేదాలు లేవని, వ్యక్తిగత కారణాలతోనే భారత్‌కు వచ్చానని.. అంతేకాకుండా టోర్నీలో మళ్లీ ఆడే అవకాశం కూడా ఉందని రైనా తెలిపిన విషయం తెలిసిందే. కాగా.. రైనా, సీఎస్‌కే వివాదం గురించి రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. తాజాగా జట్టు వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి రైనాను తొలగించారనే వార్త హల్‌చల్‌ చేస్తోంది. జట్టును వీడిన వెంటనే రైనాను వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి తొలగించారని ఓ అధికారి చెప్పాడని ఓ జాతీయ మీడియా వెల్లడించింది. రైనా టీమ్‌మెనేజ్‌మెంట్‌కు క్షమాపణలు కూడా చెప్పాడని, రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నాడని తెలిపింది.

ఇటీవల చెన్నై జట్టులో కరోనా కలకలం రేగింది. ఆ జట్టులో ఇద్దరు ఆటగాళ్లతో సహా మొత్తం 13 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అదే రోజు వ్యక్తిగత కారణాలు అంటూ రైనా భారత్‌కు వచ్చేసాడు. ఆ తర్వాత అతను భారత్‌ రావడంపై చాలా వార్తలు వచ్చాయి. హోటల్‌ గది విషయంలో సీఎస్‌కే జట్టుకు యాజమాన్యంతో రైనాకు గొడవ జరిగిందని అందుకే వచ్చేశాడని వార్తలు వచ్చాయి. రైనా చేసిన పనికి ఆ జట్టు యజయాని శ్రీనివాస్‌ నిజంగా నీకు అసంతృప్తి ఉంటే వెళ్లిపోవచ్చు అని అన్నారు. కానీ తర్వాత తన మాటను మార్చుకున్నారు.

'రైనా జట్టును వీడగానే.. చెన్నై సూపర్ కింగ్స్ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించడం జరిగింది. అతను సీఈవో, ధోనీ, కోచ్ ఫ్లేమింగ్‌తో కూడిన టీమ్‌మేనేజ్‌మెంట్‌ను సంప్రదించాడు. తన అనాలోచిత నిర్ణయంపై క్షమాపణలు కోరాడు. పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నాడు.'అని సదరు అధికారి పేర్కొన్నారు.

కాగా.. అయితే రైనా రీఎంట్రీ తన చేతుల్లో లేదని శ్రీనివాసన్‌ అన్నాడు. ధోనీనే డిసైడ్ చేస్తాడని చెప్పాడు. ప్రస్తుతానికైతే చెన్నై.. రైనా స్థానంలో ఎవరిని తీసుకోలేదు.

Next Story