మేమంతా ఇక్కడికి వచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు: విరాట్ కోహ్లీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Sep 2020 2:00 AM GMT
మేమంతా ఇక్కడికి వచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు: విరాట్ కోహ్లీ

భారతదేశంలో కరోనా ఉదృతి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించనున్నారు. ఎక్కడ చూసినా ఆటగాళ్లకు కఠిన నియమనిబంధనలు, ఎంతో జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు. జట్ల యాజమాన్యాలు కూడా ఆటగాళ్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాయి. కరోనా మహమ్మారి ఐపీఎల్ మీద పడకూడదనే ఇంతటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయి.

బయో బబుల్ లో టోర్నమెంట్ ను నిర్వహించడంపై ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ ఆడుతున్నందుకు సంతోషంగా ఉందని.. ఐపీఎల్ ఆడుతున్న వ్యక్తులు బయో-సెక్యూర్ బబుల్ ను తప్పకుండా గౌరవించాలని కోరాడు.

ఆర్సీబీ యూట్యూబ్ షో బోల్డ్ డైరీస్ లో భాగంగా విరాట్ కోహ్లీ మాట్లాడాడు. చిన్నప్పటి నుండి క్రికెట్ ఆడుతూ వచ్చానని.. ఇన్ని రోజుల పాటూ ఆడకుండా ఎప్పుడూ లేనని చెప్పుకొచ్చాడు. తిరిగి ఐపీఎల్ ద్వారా క్రికెట్ మొదలవుతోందని చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లందరూ ఇక్కడికి వచ్చింది క్రికెట్ ఆడడానికి.. బయో బబుల్ ను అందరూ గౌరవించాలి. ఊరికే తిరుగుతూ ఉండడానికి కాదు.. దుబాయ్ ని చూడడానికి రాలేదు అంటూ తెలిపాడు. గతంలో లాగా ఇప్పుడు పరిస్థితులు లేవు.. మనం ఉన్న స్థితిని గౌరవించాలి.. ఇక్కడికి రావడానికి కారణం ఐపీఎల్ ఆడడానికే.. అందరూ అది మనసులో పెట్టుకుని ప్రవర్తించాలని సూచించాడు.

కొన్ని నెలల కిందట ఐపీఎల్ ఉంటుందని కూడా ఊహించలేదు.. ఇటీవలే మొదటి ప్రాక్టీస్ సెషన్ పూర్తీ చేసినప్పుడు ఎన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయో నాకు గుర్తు వచ్చాయి. ప్రాక్టీస్ సెషన్ కు వెళ్ళినప్పుడు ఎంతో నర్వస్ గా ఫీల్ అయ్యాను. క్రికెట్ ను ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదని అనిపించిందని.. మనసులో విషయాన్ని వెల్లడించాడు కోహ్లీ. అభిమానులు లేకుండా మ్యాచ్ జరుగుతూ ఉండడం మరీ అంత కష్టం కాదని.. రంజీ ట్రోఫీలో ప్రతి చోట అభిమానులు ఉండరన్న విషయాన్ని గుర్తు చేసాడు. ఇలాంటి పరిస్థితులకు ఆటగాళ్లు అలవాటు పడ్డాలని అన్నాడు కోహ్లీ. ఆటగాళ్ల సెలెబ్రేషన్స్ విధానంలో వచ్చిన మార్పులను స్వాగతించాలని అన్నాడు కోహ్లీ.

Next Story