ఆడపిల్లలను సంరక్షించాలని ప్రభుత్వం ఎన్నో కఠిన చర్యలు అవలంభిస్తు ఆడపిల్లలకు అనేక రాయితులు కల్పిస్తూ వారికి కోసం అనేక చర్యలు చేపడుతుంది. అయినప్పటికి కొందరిలో మార్పు రావడం లేదు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. అప్పుడే పుట్టిన కవలలకు తల్లిపాలకు బదులు పురుగుల మందు తాగించాడు. ప్రస్తుతం ఇద్దరు శిశువుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా గండేడు మండలంలోని దేశాయిపల్లి గ్రామంలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. దేశాయిపల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణిని ప్రసవం కోసం ఈనెల 1వ తేదీన కోస్గిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు రాత్రి ఆమె ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. మొదటి కాన్సులో ఆడపిల్ల పుట్టడం.. ఇప్పుడు కూడా ఇద్దరు కవలలు జన్మించడంతో ఆమె భర్త కేశవులు కోపంగా ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లాడు. పిల్లలను ఎలాగైనా చంపాలని బావించి.. పురుగుల మందు కొనుగోలు చేసి భార్యకు తెలియకుండా ఇద్దరు చిన్నారులకు తాగించాడు. కాగా.. పిల్లల నోట్లోంచి నురుగలు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు వైద్యులకు తెలిపారు. పిల్లలపై విష ప్రమోగం జరిగినట్లు వైద్యులు చెప్పడంతో మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై కోస్గి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇక ఈ వ్యవహారం మొత్తం సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యింది.. ఆస్పత్రి యాజమాన్యం అక్కడి సీసీటీవీలను క్షుణ్ణంగా పరిశీలించింది. తండ్రి స్వయంగా పిల్లలకు పురుగుల మందు తాగించడంతో పాటు డబ్బాను ఆస్పత్రి బయటకు పారవేసిన దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. దీనిపై కోస్గి పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *