ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Dec 2019 1:02 PM IST
ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు..

ఢిల్లీ: ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ఢిల్లీ నుంచి బయల్దేరిన 30 నిమిషాల తర్వాత ఏసీ కోచ్‌ బీ-1 బోగీలో బ్రేక్‌ పట్టేసింది. దీంతో మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. అప్రమత్తమైన రైలు సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి హానీ జరగకపోవడంతో తృటిలో ప్రమాదం తప్పినట్లయింది. కాగా ఏపీ ఎక్స్‌ప్రెస్‌ ఢిల్లీ నుంచి విశాఖ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది, అధికారులు మంటలు చెలరేగడంపై ఆరా తీస్తున్నారు. రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం సంభవించలేదు. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story