సోనియాగాంధీపై కేసు నమోదు
By సుభాష్Published on : 21 May 2020 3:04 PM IST

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై కేసు నమోదైంది. పీఎం కేర్స్ ఫండ్ పై కాంగ్రెస్ పార్టీఅధికారిక ట్విట్టర్‌లో మే 11న చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కర్ణాటకలోని శివమొగ్గలో ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు పోలీసులు సోనియాగాంధీ కింద కేసు నమోదు చేశారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా ఆ పార్టీకి సంబంధించిన ట్విటర్ ఖాతాను సోనియాగాంధీ హ్యాండిల్ చేస్తారని ఆరోపణతో ఆమెపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కేవీ ప్రవీణ్ అనే న్యాయవాది సోనియా గాంధీపై ఈ ఫిర్యాదు చేశారు.
Also Read
అతి పిన్న వయసులోనే ప్రధాని బాధ్యతలుప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోనియాగాంధీ ఉద్దేశ పూర్వకంగానే వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. పీఎం కేర్స్ ఫండ్‌మీద సోనియా తప్పుడు ఆరోపణలు చేశారని న్యాయవాది ఫిర్యాదు పేర్కొన్నారు.
Next Story