అతి పిన్న వయసులోనే ప్రధాని బాధ్యతలు
By సుభాష్ Published on 21 May 2020 1:27 AM GMT
భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని తమిళనాడులోని చెన్నై సమీపంలో గల శ్రీపెరంబదూర్‌లో 1991 మే 21న ఎల్‌టీటీఈకి చెందిన ఆత్మాహుతి దళం బాంబు పేల్చి హతమార్చారు. నళిని, శ్రీలంక జాతీయుడైన ఆమె భర్త మురుగన్ ఎల్‌టీటీ ఉగ్రవాదులతో కలిసి రాజీవ్ గాంధీ హత్యకు కుట్రపన్నారు. మే 21న రాత్రి పది గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగింది. ఇదే రోజు
మే 21వ తేదీ.. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం రాజీవ్ గాంధీ వర్థంతిని జరుపుకొంటోంది యావత్ దేశం. 1984లో రాజీవ్‌గాంధీ తల్లి ఇందిరాగాంధీ హత్య అనంతరం ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పుడు రాజీవ్‌గాంధీకి 40 ఏళ్లు. అతి పిన్న వయస్కులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా పేరు గాంచించారు. 1984 నుంచి 1988 వరకూ రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
1991, మే 21వ తేదీన తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జాతీయ ఎన్నికలకు పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తుండగా, ఉగ్రవాదుల చేతులో హత్యకు గురయ్యారు రాజీవ్. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఇటువంటి దారుణ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించింది. మానవత్వం..శాంతి కోసం పాటు పడేలా ప్రజల్లో ఐక్యతను పెంపొందించడం కోసమే ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు.