Fact Check : రెజ్లర్ నిషా దహియా మరణించారంటూ మీడియాలో కథనాలు..!

Wrestler Nisha Dahiya not dead. జాతీయ స్థాయి రెజ్లర్ నిషా దహియా మరియు ఆమె సోదరుడు సూరజ్ హర్యానాలోని సోనిపట్‌లో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Nov 2021 3:20 AM GMT
Fact Check : రెజ్లర్ నిషా దహియా మరణించారంటూ మీడియాలో కథనాలు..!

జాతీయ స్థాయి రెజ్లర్ నిషా దహియా మరియు ఆమె సోదరుడు సూరజ్ హర్యానాలోని సోనిపట్‌లో గుర్తుతెలియని దుండగులచే కాల్చి చంపబడ్డారని మీడియాలో ఒక్కసారిగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. సోనిపట్‌లోని హలాల్‌పూర్‌లోని సుశీల్ కుమార్ రెజ్లింగ్ అకాడమీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా నిషాపై కాల్పులు జరిపినట్లు పలు ప్రముఖ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.




వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపినట్లు తెలిపాయి కొన్ని మీడియా సంస్థలు. అలాగే నిషా తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో రోహ్‌తక్‌లోని పిజిఐ ఆసుపత్రిలో చెరిపించారని కూడా నివేదికలు వచ్చాయి.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

నిషా దహియా తాను బ్రతికి ఉన్నాననే విషయాన్ని చెబుతూ వీడియోను అప్లోడ్ చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక వీడియోలో తాను సజీవంగా ఉన్నానని మరియు పూర్తిగా క్షేమంగా ఉన్నానని స్పష్టం చేసింది. ప్రస్తుతం టోర్నీ కోసం గోండాలో ఉన్నానని చెప్పింది.

నిషా దహియా సన్నిహితురాలు, రెజ్లర్ సాక్షి మాలిక్, నిషాతో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేసి, ఆమె బతికే ఉంది అని చెప్పుకొచ్చింది.

"She is alive." అంటూ పోస్టులు పెట్టారు.

స్థానిక అకాడమీలో హత్యకు గురైన రెజ్లర్ పేరు కూడా 'నిషా దహియానే' అయితే ఆమె జాతీయ స్థాయి రెజ్లర్ అథ్లెట్ కాదని తేలింది. సోనెపట్‌లో కాల్చి చంపబడిన రెజ్లర్ నిషా దహియా కొత్తగా వచ్చిన క్రీడాకారిణి. ఆమె U-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత కాదని భారత జట్టు కోచ్ మీడియాకి తెలిపారు. ఇద్దరు వేరు వేరు వ్యక్తులని స్పష్టం చేశారు. వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారని తెలిపారు.

సోనిపట్ ఎస్పీ, రాహుల్ శర్మ ట్వీట్ చేస్తూ, " కాల్చడం వలన చనిపోయిన నిషా దహియా (షూట్ డెడ్), పతక విజేత రెజ్లర్ నిషా దహియా ఇద్దరు వేర్వేరు వ్యక్తులు. పతక విజేత రెజ్లర్ పానిపట్‌కు చెందినవారని మరియు ఇప్పుడు ఒక ఈవెంట్‌లో ఉన్నారని" తెలిపారు.

జాతీయ స్థాయి రెజ్లర్ నిషా దహియా మరియు ఆమె కుటుంబంపై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టంగా తెలుస్తోంది. U-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత అయిన నిషా దహియా సజీవంగా ఉన్నారు.

కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.


Claim Review:రెజ్లర్ నిషా దహియా మరణించారంటూ మీడియాలో కథనాలు..!
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter Users
Claim Fact Check:False
Next Story